శుక్రవారం రోజు రాత్రి సాయిధరమ్ తేజ్ బైక్ నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అపోలో వైద్య బృందం సాయిధరమ్ తేజ్ కు చికిత్స అందిస్తోంది. కన్ను, ఛాతీ భాగాల్లో సాయితేజ్ కు గాయాలు కాగా వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. అయితే ఈ ప్రమాదం గురించి ప్రముఖ నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు మోహన్ తన కుమారుడి మరణంను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎప్పటికీ మరిచిపోలేనని సరదా కొరకు ప్రాణాలతో ఎవరూ చెలగాటాలు ఆడవద్దని బాబు మోహన్ సూచనలు చేశారు. ప్రమాదంలో మరణించిన వారు చనిపోయినా కుటుంబం మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుందని ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించుకోవాలని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. సాయితేజ్ హెల్మెట్ పెట్టుకుని మంచి పని చేశాడని కొంతమంది హెల్మెట్ పెట్టుకోవడాన్ని నామోషీగా ఫీల్ అవుతారని బాబు మోహన్ పేర్కొన్నారు.
హెల్మెట్ లేకుండా రోడ్డు ప్రమాదానికి గురై యాక్సిడెంట్ అయితే అతడిని నమ్మేవాళ్లు చీకట్లోకి వెళతారని అందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అని బాబు మోహన్ అన్నారు. కడుపు తీపి వల్ల వచ్చే బాధను ఎవరూ తగ్గించలేరని తండ్రి కొడుకును కోల్పోతే శరీరం శరీరం కాలిపోయే వరకు ఆ బాధ ఉంటుందని బాబు మోహన్ పేర్కొన్నారు. యూత్ తమ కుటుంబాన్ని తలుచుకుంటూ బైక్ ను నడపాలని బాబు మోహన్ సూచనలు చేశారు.