Chiranjeevi: జీవితాంతం గుర్తుండిపోయే క్షణం అది: సాయి రాజేష్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ చిత్రంగా నిలిచినటువంటి చిత్రం బేబీ. ఈ సినిమా జూలై 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలై దాదాపు రెండు వారాలు పూర్తి అవుతున్నప్పటికీ ఇంకా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయం అందుకున్నటువంటి ఈ సినిమాపై ఎంతోమంది ప్రశంసలు కురిపించారు.

ఇప్పటికే పలువురు హీరోలు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేయగా అల్లు అర్జున్ ఏకంగా అప్రిషియేట్ మీట్ అంటూ ఏకంగా ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం బేబీ సినిమా చూసి చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు.బేబీ సినిమా చూసినటువంటి మెగాస్టార్ ఏకంగా దర్శక నిర్మాతలను ఇంటికి పిలిపించారు. దాదాపు రెండు గంటల పాటు వీరితో ముచ్చటిస్తూ వీరిపై ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే సాయి రాజేష్ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కల నిజమైన వేళ నా దేవుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గారితో రెండు గంటల పాటు తన ఇంట్లో ఉన్నాను. ఆయన బేబీ సినిమాని చూసి ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్క విభాగం పై ఆయన ప్రశంసలు కురిపించారు.

ఈ క్షణాలు నాకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలని ఈయన ఎమోషనల్ అయ్యారు. రెండు గంటలు బాబాయ్ రెండు గంటలు బాస్ మాట్లాడుతుంటే కన్నీళ్లు వచ్చేసాయని ఈయన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన ఆనందాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ వీరిని అప్రిషియేట్ చేస్తూ ఒక ఈవెంట్ నిర్వహించారు. అదేవిధంగా చిరంజీవి కూడా మరొక ఈవెంట్ నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus