విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ చిత్రం జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటిస్తుండగా వైష్ణవి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.దీంతో భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది ఈ చిత్రం.ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:
| నైజాం | 2.47 cr | 
| సీడెడ్ | 0.69 cr | 
| ఉత్తరాంధ్ర | 0.88 cr | 
| ఈస్ట్ | 0.38 cr | 
| వెస్ట్ | 0.23 cr | 
| గుంటూరు | 0.30 cr | 
| కృష్ణా | 0.31 cr | 
| నెల్లూరు | 0.16 cr | 
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.42 cr | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.22 cr | 
| ఓవర్సీస్ | 1.20 cr | 
| వరల్డ్ వైడ్ (టోటల్) | 6.84 cr (షేర్) | 
బేబీ (Baby) మూవీకి రూ. 5.8 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.అయితే రెండు రోజులకే ఈ చిత్రానికి రూ.6.84 కోట్లు షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడమే కాకుండా ఈ మూవీ రూ.0.64 కోట్ల లాభాలను అందించింది. ఆదివారం సెలవు, సోమవారం బోనాల పండుగ సెలవు కొంతమందికి ఉంది కాబట్టి.. ఈ మూవీ ఇంకా లాభాలను అందించే అవకాశాలు ఉన్నాయి.
హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!
