పోస్ట్ ప్రొడక్షన్ లో కర్రి బాలాజీ “బ్యాక్ డోర్”

నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘బ్యాక్ డోర్’ షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ప్రముఖ కథానాయకి పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ వినూత్న కథా చిత్రాన్ని… ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ త్రిపురాన మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ.. “పూర్ణ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచే చిత్రం “బ్యాక్ డోర్”. పూర్ణ పెర్ఫార్మెన్స్, ఆమె గ్లామర్ ‘బ్యాక్ డోర్” చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్థాయి” అని అన్నారు.

‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ అధినేత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ‘దర్శకుడిగా బాలాజీకి చాలా మంచి పేరు తెచ్చే చిత్రమిది. మా “బ్యాక్ డోర్” సినిమా చేస్తుండగానే పూర్ణకి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ సినిమా రావడం మాకు చాలా సంతోషం కలిగించింది. అలాగే కంగనా రనౌత్ నటిస్తున్న జయలలిత బయోపిక్ లోనూ మా హీరోయిన్ పూర్ణ నటిస్తుండడం మాకు గర్వకారణం. “బ్యాక్ డోర్” చిత్రం ఆమె కెరీర్ కి మరో టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది” అని అన్నారు. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. “బాలాజీగారు ప్రతి సీన్ ఎంతో ప్లానింగ్ తో, క్లారిటీతో తెరకెక్కించారు. దర్శకుడిగా బాలాజీ గారికి… నాకు, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చే చిత్రమిది” అని అన్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus