Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో ఆ కాంబినేషన్ లేనట్లే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరియు డైరెక్టర్ సురేందర్ రెడ్డి  (Surender Reddy) కాంబినేషన్‌లో ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే, ఆ ప్రాజెక్ట్‌పై ఇకపై ఎలాంటి అప్‌డేట్స్ రాలేదనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఈ ప్రాజెక్ట్ రద్దయిందని కూడా పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత రామ్ తాళ్లూరి (Ram Talluri)  ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రామ్ తాళ్లూరి మాట్లాడుతూ, “సురేందర్ రెడ్డి పవన్ కోసం ప్రత్యేకంగా ఒక కమర్షియల్ కథను సిద్ధం చేశారు.

Pawan Kalyan

ఈ కథను రేసుగుర్రం (Race Gurram) , కిక్ (Kick) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తరహాలోనే తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాము. స్క్రిప్ట్ కూడా పూర్తయింది. అయితే, పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం, సురేందర్ మరో ప్రాజెక్ట్ తీస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ కాస్త వాయిదా పడింది,” అని చెప్పారు. ఇప్పట్లో పవన్ మరియు సురేందర్ కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు లేవని రామ్ తాళ్లూరి స్పష్టం చేశారు.

పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో పూర్తిగా బిజీగా ఉండటం, అలాగే ఆయన అంగీకరించిన ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నందున ఈ సినిమాకు ఇంకా సమయం పట్టవచ్చని వివరించారు. అయితే, సురేందర్ రెడ్డి కొత్తగా మరో కథను సిద్ధం చేశారని రామ్ తాళ్లూరి వెల్లడించారు. ఈ కథను త్వరలోనే ఒక పెద్ద హీరోకు వినిపించేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

మొత్తానికి, పవన్ – సురేందర్ కాంబినేషన్‌పై వచ్చిన పుకార్లకు రామ్ తాళ్లూరి ఈ ఇంటర్వ్యూలో స్పష్టత ఇవ్వడం ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కిక్ సినిమా చేయాల్సింది. కానీ కుదరలేదు. ఇక ఈసారైనా సెట్టవుతుందని అనుకుంటే అది కుదరలేదు. మరి ఈ కాంబినేషన్ ఎప్పటికి సెట్స్‌పైకి వస్తుందో చూడాలి, కానీ రామ్ తాళ్లూరి మాత్రం పవన్ ప్రాజెక్ట్‌పై ఇంకా ఆసక్తిగా ఉన్నారు.

ఎస్.జె.సూర్య.. ఆ డైలాగ్ తప్ప ఇంకేమి గుర్తుకు రాదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus