పీవీ సింధు పరిచయం అవసరం లేని పేరు క్రీడారంగంలో మన దేశానికి ఎన్నో పథకాలు సాధించి దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెబుతున్న క్రీడాకారులలో పివి సింధు ఒకరు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఇప్పటికే ఈమె ఒలంపిక్స్ లో పథకాలు సాధించి దేశ కీర్తి ప్రతిష్టలను పెంచేశారు.ఈ విధంగా క్రీడారంగంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పీవీ సింధు సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే సోషల్ మీడియా వేదికగా పీవీ సింధు నిత్యం పలు డాన్స్ వీడియోలు చేస్తూ తనలో ఈ యాంగిల్ కూడా ఉందంటూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధు తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు సొంతంగా ఒక అకాడమీ స్థాపించాలనే కోరిక ఉందని తెలిపారు.
ఇకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలను వేయగా అందుకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నించగా తనకు ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని వారిలో ప్రభాస్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఇకపోతే పెళ్లెప్పుడు అంటూ ఆలీ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావించారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తనకి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని 2024 ఒలింపిక్స్ లో ఎలాగైనా గోల్డ్ మెడల్స్ సాధించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.
ఈ ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తరువాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని అయితే తనకు ఇండస్ట్రీలో ఎంతోమంది స్నేహితులతో పాటు బంధువులు కూడా ఉన్నారని పొరపాటున కూడా హీరోలను తాను పెళ్లి చేసుకోనని, తన పెళ్లికి ఇంకాస్త సమయం ఉందని ఈ సందర్భంగా పీవీ సింధు తన వ్యక్తిగత జీవితం గురించి తన పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!