Bagheera Review in Telugu: బఘీర సినిమా రివ్యూ & రేటింగ్!
October 31, 2024 / 05:17 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
శ్రీమురళి (Hero)
రుక్మిణి వసంత్ (Heroine)
ప్రకాష్ రాజ్, గరుడ రామ్ తదితరులు.. (Cast)
డా.సూరి (Director)
విజయ్ కిరంగదూర్ (Producer)
బి.అజనీష్ లోక్నాథ్ (Music)
ఏజే శెట్టి (Cinematography)
Release Date : అక్టోబర్ 31, 2024
“కేజీఎఫ్ (KGF) , సలార్ (Salaar) ” చిత్రాలతో అశేషమైన అభిమానగణాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కథ అందించగా.. “సలార్” ఒరిజినల్ అయిన “ఉగ్రం” హీరో శ్రీమురళి హీరోగా నటించిన చిత్రం “బఘీర”. కే.జి.ఎఫ్ చిత్రానికి రైటర్ గా వర్క్ చేసిన డా.సూరి ఈ చిత్రానికి దర్శకుడు. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కన్నడతోపాటు తెలుగులో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!
Bagheera Review in Telugu
కథ: చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటను మస్తిష్కంలో బంధించుకొని కష్టపడి పోలీస్ ఆఫీసర్ అవుతాడు వేదాంత్ (శ్రీమురళి). అయితే.. యూనిఫాం వేసుకొని తాను అనుకున్నట్లుగా అన్యాయాన్ని అంతం చేయలేనని అర్థం చేసుకొని, యూనిఫాం తీసేసి “బఘీర”గా సమాజంలోని అన్యాయాల్ని చక్కబెడుతుంటాడు. ఆ కారణంగా వేదాంత్ ఎదుర్కొన్న సమస్యలేమిటి? వాటిని అతడు ఎలా జయించాడు? ఈ క్రమంలో బఘేర తలపడిన పెద్ద విలన్ విలన్ ఎవరు? అనేది సినిమా (Bagheera) కథాంశం.
నటీనటుల పనితీరు: శ్రీమురళి ఆల్రెడీ కన్నడలో సీనియర్ నటుడు. పలు కమర్షియల్ సినిమాల్లో నటించి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడు. “బఘీర”లో అతడి నటన ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ లో అతడి స్క్రీన్ ప్రెజన్స్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తుంది. “సప్తసాగరాలు దాటి” (Sapta Sagaralu Dhaati) అనంతరం రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) మళ్లీ ఈ సినిమాలో కనిపించింది.
చెప్పుకోదగ్గ పాత్రేమీ కాదు. చాలా రొటీన్ హీరోయిన్ రోల్. ప్రకాష్ రాజ్(Prakash Raj) , అచ్యుత్ కుమార్ (Achyuth Kumar), రంగాయన రఘు తదితర సీనియర్ ఆర్టిస్టులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని భరించలేని హీరో, ముసుగు వేసుకొని ఆ అన్యాయాల్ని ఎదుర్కోవడం అనేది ఎప్పుడో “ఆజాద్” టైమ్ నుంచి చూస్తూనే ఉన్నాం. “బఘీర” విషయంలోనూ కూడా దాదాపుగా అదే జరిగింది. కంటెంట్ లో పెద్ద మార్పేమీ లేదు కానీ, టెక్నాలజీ కారణంగా కొన్ని యాడ్ ఆన్స్ జరిగాయి. ముఖ్యంగా శ్రీమురళి సూపర్ హీరోగా తయారయ్యే సీన్స్ అన్నీ హిందీ సినిమా “భావేష్ జోషి” నుండి బాగా స్ఫూర్తి పొందినవి కావడంతో ఎక్కడా కొత్తదనం కూడా కనిపించదు. దర్శకుడిగా డా.సూరి పనితనం యాక్షన్ బ్లాక్స్ లో తప్ప ఎక్కడా కనిపించదు. మిగతా స్క్రీన్ ప్లే మొత్తం చాలా పేలవంగా సాగింది.
అజనీష్ లోక్నాథ్ నేపథ్య సంగీతం ఈసారి అలరించలేకపోయింది. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం బాగుంది. వర్షం షాట్స్ & యాక్షన్ బ్లాక్స్ ను స్టైలిష్ గా చూపించాడు. ఎడిటింగ్ ఫార్మాట్ మొత్తం కేజీఎఫ్ ను తలపిస్తుంది. దర్శకుడు ఆ స్కూల్ విద్యార్థి కాబట్టి ఏం చేయలేం అనుకోండి. ప్రొడక్షన్ విషయంలో మాత్రం నిర్మాతలు అస్సలు రాజీపడలేదు. అవసరమైనదానికంటే ఎక్కువే ఖర్చు పెట్టారు.
విశ్లేషణ: రొటీన్ యాక్షన్ సినిమాలు తీయడంలో తప్పేమీ లేదు. గత ఏడాది వచ్చిన “వాల్తేరు వీరయ్య” సగటు టెంప్లేట్ కమర్షియల్ సినిమా అయినప్పటికీ, కథనంగా ఆకట్టుకోవడంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సో, ప్రేక్షకుల్ని టెంప్లెట్ సినిమాలతో మెప్పించాలంటే మంచి కథనం ఉండాలి. అలాగే.. ప్రేక్షకుల్ని హోల్డ్ చేయగల అంశాలు కూడా ఉండాలి. “బఘీర”లో యాక్షన్ బ్లాక్స్ తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. అందువల్ల శ్రీమురళి కష్టం వృథా అయ్యిందని చెప్పాలి. అయితే కన్నడలో అతడు మాస్ స్టార్ కాబట్టి అక్కడ ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ.. తెలుగులో “లక్కీ భాస్కర్, క, అమరన్”లను తట్టుకొని నిలబడడం అనేది మాత్రం కష్టమే.