Sai Pallavi: సాయి పల్లవితో బలగం డైరెక్టర్.. కథేంటి?

టాలీవుడ్ లో తన ప్రత్యేకతతో అందరి దృష్టిని ఆకర్షించిన సాయి పల్లవి (Sai Pallavi)  , కొత్త ప్రాజెక్ట్ తో మరోసారి అభిమానుల ముందుకు రాబోతోంది. బలగం (Balagam) డైరెక్టర్ వేణు ఎల్లమ్మ (Venu Yeldandi)   అనే కథతో సాయి పల్లవిని తీసుకోవాలని చర్చలు జరుపుతున్నట్లు టాక్ వస్తోంది. ఇదివరకు ఈ కథను నానితో ప్లాన్ చేసిన వేణు, కొన్ని కారణాల వల్ల అతనితో ప్రాజెక్ట్ ను ఆరంభించలేకపోయారు. అయితే, దర్శకుడు వేణు   ఈ కథను నితిన్ కి వినిపించగా, అతను వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Sai Pallavi

నితిన్ తో (Nithiin)  జోడీగా నటించడానికి సాయి పల్లవి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ని దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో భారీ స్థాయిలో రూపొందించబోతున్నారు. సాయి పల్లవి ఎల్లప్పుడూ కథలో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎల్లమ్మ అనే పాత్రలో సాయి పల్లవి నటించబోతున్న ఈ కథ, ఆమెకు ఎంతగానో ప్రాధాన్యతనిచ్చేలా ఉంటుందనే టాక్ ఉంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని అంటున్నారు.

నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల  (Venky Kudumula)  దర్శకత్వంలో రాబిన్ హుడ్  c చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాతే ఎల్లమ్మ షూటింగ్ మొదలుకాబోతోంది. అంతేకాకుండా, నితిన్ విక్రమ్ కె కుమార్ తో (Vikram kumar) కూడా ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ తో నితిన్ తన కెరీర్ లో మరో గొప్ప దశను చేరుకోవాలని చూస్తున్నాడు. సాయి పల్లవికి ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది.

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఆమె, ఈ చిత్రంతో మరో బలమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించబోతుంది. వేణు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆమె కెరీర్ లో మరో ట్రెండ్ సెట్టర్ గా నిలిచే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus