Director Venu: బలగం సక్సెస్.. స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్న వేణు!

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన వేణు అనంతరం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమై సినిమా అవకాశాల కోసం ఎదురుచూశారు. అయితే డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి ఈయన ఒక అద్భుతమైన కథను రాసి బలగం అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అయింది.

ఇలా ఈ సినిమా ఎంతోమంది సినీ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా వంద అవార్డులను కూడా కైవసం చేసుకుని సంచలనమైన రికార్డు సృష్టించింది.ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వేణు తదుపరి సినిమా అవకాశాన్ని కూడా తన బ్యానర్ లో చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ క్రమంలోనే వేణు (Venu) ఈ అవకాశాన్ని కూడా ఎంతో అద్భుతంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే తన తదుపరి సినిమా కూడా బలగం సినిమాకి మించి ఉండాలని ఈయన గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే దిల్ రాజు నిర్మాణంలో మరోసారి వేణు సినిమా చేసే అవకాశం పొందడమే కాకుండా ఈసారి తన సినిమాలో ఒక స్టార్ హీరో ఉండాలని దిల్ రాజుకు చెప్పారట. ఇలా తన రెండవ సినిమాని స్టార్ హీరోతో చేయాలని ఉంది అంటూ దిల్ రాజుకు చెప్పడంతో దిల్ రాజు కూడా షాక్ కి గురయ్యారని తెలుస్తుంది.

అయితే ఈ విషయంపై పలువురు స్పందిస్తూ బలగం వంటి అద్భుతమైన సినిమాని అందించిన వేణు స్టార్ హీరో సినిమాకి డైరెక్షన్ చేస్తే తప్పేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తించి ఆ అవకాశం తనకు కల్పిస్తే మరో మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ ఈ విషయంపై కామెంట్ చేస్తున్నారు.మరి వేణు కోరినట్టే దిల్ రాజు స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం కల్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus