Balakrishna: మా నాన్న నుంచి నేను అదే నేర్చుకున్న..మా నాన్న గ్రేట్ అంటూ? బాలయ్య కామెంట్స్!

  • May 29, 2023 / 05:47 PM IST

నందమూరి తారకరామారావు (సీనియర్ ఎన్టీఆర్) గొప్పదనం గురించి సినిమా ఇండస్ట్రీలో కథలు కథలుగా చెప్పుకుంటారు. సీనియర్ ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నిర్మాతల శ్రేయస్సును ఆలోచించే హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని చెప్పవచ్చు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్ అసాధారణ విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన సీనియర్ ఎన్టీఆర్ కు ఎప్పుడూ ఉండేదనే సంగతి తెలిసిందే.

బాలకృష్ణ (Balakrishna) ఒక సందర్భంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగువారి సత్తాను ఢిల్లీకి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అనే సంగతి తెలిసిందే. కుల ప్రస్తావన తెస్తే సీనియర్ ఎన్టీఆర్ కు చాలా కోపం వచ్చేదని ఇండస్ట్రీలో చాలామంది చెప్పుకుంటారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సీనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి ఎదిగారు.

ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే28) కావడంతో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. స్టార్ హీరో బాలకృష్ణ తండ్రిని దైవంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. ఏ ఈవెంట్ లో మాట్లాడినా నాన్న పేరును తలచుకుని బాలయ్య తన స్పీచ్ ను మొదలుపెడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాలో నటించే సమయంలో తలకు గాయం కాగా రక్తం కారిందని తెలిసిన నాన్న అదేం పట్టించుకోకుండా షూట్ చేశారని బాలయ్య తెలిపారు.

బ్రహ్మర్షి విశ్వామిత్ర షూట్ సమయంలో కూడా కాలికి గాయం కాగా అదిపట్టించుకోకుండా షాట్ తీశారని బాలయ్య అన్నారు. నాన్న నుంచి క్రమశిక్షణ అలవడిందని రోజూ ఉదయం మూడున్నరకే నిద్ర లేస్తానని బాలయ్య తెలిపారు. బాలయ్య వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus