Balakrishna, Anil Ravipudi: బాలయ్య అనిల్ కాంబో మూవీ విలన్ అతనేనా?

గతేడాది నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకోగా ఈ ఏడాది ఎఫ్3 సినిమాతో అనిల్ రావిపూడి సక్సెస్ ను అందుకున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం అరవింద స్వామి పేరును అనిల్ రావిపూడి పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అరవింద స్వామి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు తెలుగులో సక్సెస్ సాధించాయి.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ సినిమాలో అరవింద స్వామి విలన్ రోల్ లో నటించి మెప్పించారు. ఆ తర్వాత పలువురు దర్శకులు అరవింద స్వామిని తెలుగు సినిమాలలో నటింపజేయాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. దర్శకుడు అనిల్ రావిపూడి అరవింద స్వామి డేట్ల కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అరవింద స్వామి ఓకే చెబితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ సినిమాలో 50 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి పాత్రలో బాలయ్య కనిపించనున్నారు. బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనుండగా బాలయ్య శ్రీలీల కాంబోలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రీలీలకు తల్లి పాత్రలో నటించే హీరోయిన్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

అటు బాలయ్య ఇటు అనిల్ రావిపూడి కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాదే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. సినిమాసినిమాకు బాలయ్య క్రేజ్, రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus