Balakrishna, Anil Ravipudi: బాలయ్య ఫ్యాన్స్ కు భారీ షాకిచ్చిన అనిల్ రావిపూడి!

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీకి ఇప్పటికే చాలా టైటిల్స్ వినిపించాయి. రామారావుగారు, అన్నగారు మరికొన్ని టైటిల్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రచారంలోకి వచ్చాయి. ఎఫ్3 సక్సెస్ తో జోరుమీదున్న అనిల్ రావిపూడి ఇప్పటికే బాలయ్య సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు.

2023 సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే రొటీన్ టైటిల్స్ కు భిన్నంగా అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు “బ్రో..ఐ డోంట్ కేర్” అనే టైటిల్ ఫిక్స్ అయింది. టైటిల్ యూత్ ను ఆకట్టుకునేలా ఉండాలని భావించి అనిల్ టైటిల్ లో బ్రో యాడ్ చేశారని తెలుస్తోంది.

అయితే అనిల్ రావిపూడి ఈ టైటిల్ తో బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రం షాకిచ్చారు. సాహో గారపాటి నిర్మాతగా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనున్నారు. బాలయ్యకు జోడీగా ప్రియమణి నటిస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా మరో హీరోయిన్ పేరును కూడా పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తిగా బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నారు.

అటు బాలయ్య అభిమానులకు ఇటు అనిల్ రావిపూడి అభిమానులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. బాలయ్య తర్వాత సినిమాలతో కూడా వరుస విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు బాలయ్యకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లపై సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus