Balakrishna, Anil Ravipudi: ఆ విషయంలో బోయపాటిని ఫాలో అవుతున్న అనిల్!

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి నాలుగు నెలల సమయం ఉంది. అయితే అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ సినిమాలోని కీలక నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనున్నారని అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెల్లడించారు. ప్రియమణి ఈ సినిమాలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రియమణి ఈ సినిమాలో నిజంగా నటిస్తారో లేదో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఈ సినిమాలో విలన్ కూడా ఫైనల్ అయ్యారని బాలయ్యకు విలన్ గా జగపతిబాబు ఈ సినిమాలో నటించనున్నాడని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. బాలయ్య జగపతిబాబు కాంబినేషన్ లో తెరకెక్కిన లెజెండ్, అఖండ సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల సక్సెస్ లతో బాలయ్య సినిమాలో మరోసారి జగపతి బాబు ఛాన్స్ కొట్టేశాడని ప్రచారం జరుగుతోంది. అయితే జగపతిబాబును విలన్ గా ఎంపిక చేసినా పరవాలేదని ఆయన పాత్ర మాత్రం కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

2023 సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. అనిల్ ఖాతాలో ఈ సినిమాతో మరో సక్సెస్ చేరడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ హీరోలతో పని చేయడానికి అనిల్ రావిపూడి ఆసక్తి చూపిస్తున్నారు. అనిల్ రావిపూడి సక్సెస్ లో ఉండటంతో నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం అనిల్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. బాలయ్యకు అనిల్ రావిపూడి కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ అయితే ఉంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా. విలన్ విషయంలో అనిల్ రావిపూడి బోయపాటి శ్రీనును ఫాలో అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus