Balakrishna, Anil Ravipudi: ‘చెన్నకేశవరెడ్డి’ పాటతో అనిల్‌ రావిపూడి సినిమాకు టైటిల్‌!

నవ్వే వాళ్లు నవ్వని, ఏడ్చే వాళ్లు ఏడ్వని, పొగిడే వాళ్లు పొగడని, తిట్టే వాళ్లు తిట్టని.. ‘డోంట్‌ కేర్‌.. డోంట్‌ కేర్‌’. ఈ పాట ఏ సినిమాలోనిదో మీకు తెలుసుగా? ‘చెన్నకేశవరెడ్డి’లోని హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌. ఆ రోజుల్లో ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. యాటిట్యూడ్‌ చూపించాలనుకునే యువత ఈ పాటను ఆ రోజుల్లో హమ్‌ చేస్తుండేది. ఇప్పుడు ఆ పాటనే బాలయ్య సినిమాకు టైటిల్‌గా పెడుతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం బాలయ్య ఈ సినిమాను ‘అన్‌స్టాపబుల్‌’ షోలో అధికారికంగా ప్రకటించారు. ‘ఎఫ్‌ 3’ పనులు అయిపోవడంతో ఇప్పుడు అనిల్‌ రావిపూడి ఈ సినిమా పనులు మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. తన టీమ్‌ ఇప్పటికే సినిమా కథ మీద కుస్తుపడుతోంది. ఈ క్రమంలోనే సినిమా పేరు ఇదేనంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. వాటి ప్రకారం చూస్తే ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో పాట ఈ సినిమా టైటిల్‌ అవుతుంది.

అనిల్‌ రావిపూడి సినిమాలో బాలయ్య యాటిట్యూడ్‌ ‘బ్రో… ఐ డోంట్‌ కేర్‌’ అనేలా ఉంటుందట. అందుకే సినిమాకు ఈ పేరు అయితేనే బాగుంటుందని అనుకున్నారట. త్వరలోనే ఈ సినిమా పేరు అఫీషియల్‌గా అనౌన్స్‌ చేస్తారట. ఇక ఈ సినిమా కథ, కాన్సెప్ట్‌ గురించి అనిల్‌ రావిపూడి ఇప్పటికే చెప్పేశారు. ఇందులో బాలయ్య మధ్య వయస్కుడిగా కనిపిస్తాడు. అతని కూతురిగా యువ కథానాయిక శ్రీలీల నటిస్తుందట. ఈ సినిమాలో బాలయ్య భార్యగా ప్రియమణి నటిస్తారని సమాచారం.

ఇక ఈ సినిమాలో విలన్‌గా కథానాయిక అంజలిని తీసుకుంటున్నారని సమాచారం. సినిమాలో లేడీ విలన్‌ రోల్‌ చాలా ప్రాముఖ్యత చాలా ఎక్కువని, అందుకే అంజలిని ఎంచుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం బాలయ్య .. గోపీచంద్‌ మలినేని సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే అనిల్‌ రావిపూడి సినిమా స్టార్ట్‌ చేసేస్తారని సమాచారం. అక్టోబరులో దసరాగా కానుకగా సినిమా స్టార్ట్‌ ఉండొచ్చట.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus