క్రాక్ లా కాకూడదంటున్న బాలయ్య.. ఏమైందంటే..?

ఈ మధ్య కాలంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలేవీ బ్లాక్ బస్టర్ హిట్ కాలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటిస్తుండగా ఈ ఏడాది మే నెల 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. సింహా, లెజెండ్ సినిమాల తరువాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను చిత్రయూనిట్ ఫైనల్ చేసినట్టు సమాచారం.

త్వరలో ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా బాలకృష్ణ ఈ నిర్మాతకు వార్నింగ్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాహసం శ్వాసగా సాగిపో సినిమా హక్కులకు సంబంధించిన వివాదంలో మిర్యాల రవీందర్ రెడ్డి చిక్కుకున్న నేపథ్యంలో ఈ వివాదం వల్ల తన సినిమాకు ఏ సమస్య రాకూడదని బాలయ్య నిర్మాతకు అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది.

రెండు నెలల క్రితం క్రాక్ సినిమా వివాదంలో చిక్కుకోవడంతో మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. తన సినిమాకు అలాంటి ఇబ్బందులు రాకూడదని భావించిన బాలకృష్ణ సినిమా రిలీజ్ కు ముందే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలను క్లియర్ చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. మిర్యాల సురేందర్ రెడ్డిపై యూఎస్ డిస్ట్రిబ్యూటర్ వేసిన కేసు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలకృష్ణ బోయపాటి సినిమా హక్కులకు భారీగా పోటీ నెలకొందని.. బాలయ్య నటించిన ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమా హక్కులను ఎక్కువ మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు నిర్మాతలు చెబుతున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus