#NBK107: ఆ మూవీ రీమేక్ లో నటసింహం నటిస్తున్నారా?

స్టార్ హీరో బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తుండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. క్రాక్ సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా నుంచి తాజాగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉన్న బాలయ్య ఫోటో లీకైన సంగతి తెలిసిందే. ఈ లుక్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు ప్రశంసలు వస్తున్నాయి.

Click Here To Watch

అయితే తాజాగా లీకైన బాలయ్య లుక్ కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా నటించి హిట్టైన మఫ్టీ సినిమాను పోలి ఉంది. సిరిసిల్లలో ఈ షూటింగ్ మొదలు కాగా మఫ్టీ సినిమాకు ఈ సినిమా రీమేక్ అని బలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం గురించి మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ రీమేక్ సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే.

మరోవైపు బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్నారు. శృతి హాసన్ సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా నటించడంతో పాటు యంగ్ జనరేషన్ హీరోలకు సైతం జోడీగా నటిస్తుండటం గమనార్హం. అఖండ సినిమాను మించి తర్వాత సినిమాతో బాలయ్య సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా విజయాలను సొంతం చేసుకున్న బ్యానర్లలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరా టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు ఊహించని స్థాయిలో బిజినెస్ ఆఫర్లు కూడా వస్తున్నాయని సమాచారం అందుతోంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus