NBK107: నిర్మాతలు అలా చెబితే బాలయ్య ఒప్పుకుంటారా?

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. క్రాక్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను అమెరికాలో షూట్ చేయాల్సి ఉండగా వీసా సమస్యల వల్ల అమెరికాకు బదులుగా టర్కీలో షూట్ చేయాలని చిత్రయూనిట్ నిర్ణయం తీసుకుంది.

అయితే షూటింగ్ ల బంద్ వల్ల బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ షూట్ సైతం వాయిదా పడిందని సమాచారం అందుతోంది. మరోవైపు బాలయ్య నిర్మాతలకు విచిత్రమైన సమస్య ఎదురైనట్టు తెలుస్తోంది. బాలయ్య వీలైనంత వేగంగా గోపీచంద్ మలినేని మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అన్ స్టాపబుల్2 షోకు, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాకు డేట్లు కేటాయించాల్సి ఉండటంతో బాలయ్య గోపీచంద్ మలినేని మూవీ షూటింగ్ ను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.

అయితే ఇప్పటికిప్పుడు టర్కీకి టికెట్లను బుకింగ్ చేయడం వల్ల నిర్మాతలకు భారం పెరగనుందని తెలుస్తోంది. ఇప్పుడు టికెట్లను బుకింగ్ చేసుకోవాలంటే రెగ్యులర్ రేట్ల కంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అందువల్ల కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం నిర్మాతలపై భారం పడనుందని బోగట్టా. ఈ విషయం బాలయ్యకు ఎలా చెప్పాలోనని నిర్మాతలు టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.

టర్కీలో ఫైట్ సీన్లతో పాటు హీరో పాత్ర మరణించే సన్నివేశాలను షూట్ చేయాల్సి ఉందని సమాచారం. ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus