NBK107: బాలయ్య గోపీచంద్ మూవీ గురించి ఈ వార్త నిజమేనా?

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుండగా బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బాలయ్య సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది బాలయ్య నటించిన అఖండ విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ ఏడాది బాలయ్య నటించిన ఒక్క సినిమా అయినా విడుదలైతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అయితే బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో సినిమాలో బాలయ్య పాత్ర క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. పోకిరి తరహా క్లైమాక్స్ ట్విస్ట్ ను ఈ సినిమాలో చూడబోతున్నామని సమాచారం అందుతోంది. బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను విదేశాలలో షూట్ చేయాల్సి ఉండగా అతి త్వరలో టర్కీ షెడ్యూల్ మొదలుకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అనధికారికంగా లీకైన ఫోటోలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

బాలయ్య సినీ కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం బాలకృష్ణ 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. క్రాక్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాతో ఆ సినిమాకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాసినిమాకు స్టార్ హీరో బాలకృష్ణ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus