Balakrishna, Gopichand Malineni: బాలయ్య గోపీచంద్ మూవీలో విలన్ ఇతనేనా?

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా భావన నటించే అవకాశం ఉందని వార్తలు వస్తుండగా భావన ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో విలన్ కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ గా నటించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. కన్నడలో దునియా విజయ్ పాపులర్ నటుడనే సంగతి తెలిసిందే. దునియా విజయ్ ఈ సినిమాలో నటిస్తే కర్ణాటకలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది.

క్రాక్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ను విలన్ పాత్రలో చూపించిన గోపీచంద్ మలినేని దునియా విజయ్ ను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో చూడాల్సి ఉంది. క్యారెక్టర్ కు సరైన నటులను ఎంపిక చేస్తారని గోపీచంద్ మలినేనికి పేరు ఉంది. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus