మెగాస్టార్ చిరంజీవి సెకెండ్ ఇన్నింగ్స్…స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో కాస్త ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే….అయితే ఈ సినిమా అదిగో….ఇదిగో అంటూ మొదలు కావడానికే రెండు ఏళ్లకు పైగా పట్టేసింది…ఇక అదే క్రమంలో ఈ సినిమా మొదలయ్యి, అంతా పూర్తి అయ్యీ, విడుదలకు సిద్దంగా ఉన్న క్రమంలో కూడా మెగా స్టార్ సినిమాకు అడ్డంకులు తప్పేలా కనిపించడంలేదు….విషయంలోకి వెళితే…టాలీవుడ్ ను తిరిగి శాసిద్దాం అని మళ్ళీ బయలు దేరిన మెగాస్టార్ కి అడుగడుగునా అడ్డంకులే ఎదురు అవుతున్నాయి….మెగా150 మూవీ ఖైదీ నం150 ఆడియో వేడుక బెజవాడ వేదికగా ఇందిరాగాంధీ స్టేడియమ్ లో చేద్దాం అని గత నెల 25న ముహూర్తం ఫిక్స్ చేశారు మెగా టీమ్…అయితే ఆ ప్రోగ్రామ్ కి అనుమతి లభించక పోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు…ఇక అదే క్రమంలో ఆడియో వేడుకనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కింద మార్చి మళ్లీ అదే వేదికపై ఈ ప్రోగ్రామ్ నిర్వహించాలి అని ఎన్నో కలలు కన్నారు…కానీ మళ్లీ అదే పరిస్థితి పాపం ఈ సారి కూడా మెగాస్టార్ కు అవకాశం దొరకలేదు.
ఇక ఇలా ప్రతీ సారి చిరు రిక్వెస్ట్ ను ప్రభుత్వం తిరస్కరిస్తూ ఉండడంతో కాస్త కోపంగా ఉన్న అభిమానులు ఆంధ్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు….గతంలో ఇదే ఆడిటోరియంలో చిరంజీవి ‘ఇంద్ర’ 175 రోజుల ఫంక్షన్ కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు లేటెస్ట్ గా ఇలాంటి అడ్డంకులు ఏర్పరచడం ఏమిటి అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు…అంతేకాదు పనిలో పనిగా దీని వెనుక బాలయ్య హస్తం ఉంది అంటూ కేకలు పెడుతున్నారు….అయితే వారు ఏం చేసినా, ఎలా చేసినా ప్రభుత్వం మాత్రం ఈ వేడుకకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో చేసేది ఏమీ లేక… ‘ఖైదీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గుంటూర్ కి తరలిస్తున్నట్లు టాక్…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.