Balakrishna: బాలయ్య హెలికాప్టర్ ఎమర్జెన్సీ లాండింగ్.. సాంకేతిక లోపమే కారణం!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం..

చిత్ర యూనిట్‌తో కలిసి బాలకృష్ణ హెలికాప్టర్‌లో నిన్న ఒంగోలుకు చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఒంగోలులోని అర్జున్ ఇన్‌ఫ్రా గ్రౌండ్‌లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సినిమా యూనిట్ ఘనంగా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన తర్వాత నిన్న రాత్రి ఒంగోలులోనే బస చేసిన బాలకృష్ణ ఈరోజు ఉదయం హెలికాప్టర్ లో హైదరాబాద్‌కు బయలుదేరారు. హెలికాప్టర్ బయలుదేరిన 15 నిమిషాలకే ఒంగోలు‌లోని పీటీసీ గ్రౌండ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

ఒంగోలు నుండి హైదరాబాదుకి బయలుదేరిన తర్వాత పొగ మంచు ఎక్కువగా ఉండటంవల్ల హెలికాప్టర్ వెళ్లటానికి వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. దీంతో బాలకృష్ణ ఒంగోలులోనే ఉండిపోయారు. ఇక ఏటీసీ నుంచి క్లియరెన్స్ రాగానే బాలకృష్ణ హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్ పనులలో బాలకృష్ణ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సినిమా మీద అంచనాలు పెంచాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని సినిమా యూనిట్ వెల్లడించింది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus