Balakrishna: అల్లు అరవింద్‌ ఈ మ్యాజిక్‌ చేసి చూపిస్తారా…

నందమూరి బాలకృష్ణ టాక్‌ షో చేయడం… అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ అయితే… అది ‘ఆహా’లో చేయడం మరో బంపర్‌ సర్‌ప్రైజ్‌. అయితే వీటికి మించిన సర్‌ప్రైజ్‌ మరొకటి ఉండబోతోందా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే చర్చ. ఆ సర్‌ప్రైజ్‌ వింటే మీరు కచ్చితంగా సర్‌ప్రైజ్‌ అవుతారు. ఏంటీ ఇన్నిసార్లు సర్‌ప్రైజ్‌ అంటున్నారా అని ఆ వార్త అంత స్పెషల్‌ మరి. అదే గీతా ఆర్ట్స్‌లో బాలయ్య సినిమా. ఏంటీ… గీతా ఆర్ట్స్‌లో బాలకృష్ణ సినిమా చేస్తున్నారా? అని ఆశ్చర్యపోతున్నారా!

ఇందులో నిజానిజాలు ఎంతో తెలియవు కానీ గీతా ఆర్ట్స్‌ కాంపౌండ్‌ నుండి వస్తున్న సమాచారం ప్రకారం అయితే అవుననే అనిపిస్తోంది. బాలకృష్ణ ఓ కథ సిద్ధం చేయమని తమ ఆస్థాన దర్శకులకు గీతా ఆర్ట్స్‌ సమాచారం పంపిందని టాక్‌. మంచి కథ సెట్‌ అయితే బాలకృష్ణకు వినిపించి ఓకే చేయించుకునే పనిలో ఉన్నారట. ‘ఆహా’లో ‘అన్‌స్టాపబుల్‌’ కోసం బాలకృష్ణను హోస్ట్‌గా ఒప్పించిన అల్లు అరవింద్… సినిమా కోసం ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదు.

బాలయ్య భోళా శంకరుడి లెక్క అని టాలీవుడ్‌లో అంటారు. మంచి కథ వస్తే… ఎవరితోనైనా సినిమా చేస్తారు బాలయ్య. ఇప్పుడు గీతా ఆర్ట్స్‌ మంచి కథ వస్తే… బాలయ్య ఓకే చేస్తాడు. అయితే అలాంటి కథ ఎవరు సిద్ధం చేస్తారో చూడాలి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus