Balayya Babu: సినిమా ఇండస్ట్రీకి ఓటీటీ కాంపిటీషన్ గా మారింది.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుండి ఎంతోమంది హీరోలుగా అడుగుపెట్టారు. నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా 100కు పైగా సూపర్ హిట్ సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన బాలకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇలా వరుస సినిమాలలో నటించడమే కాకుండా ఆహా వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ రియాలిటీ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

ఇదిలా ఉండగా ఇటీవల కాచిగూడలోని తారకరామ సినిమా థియేటర్ పునః ప్రారంభానికి హాజరైన బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీ గురించి, ఓటీటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ నందమూరి తారక రామారావు గారి పై వున్న అభిమానంతో ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ ని కొత్త హంగులతో పునరుద్ధరించారు. ఈ ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ పునః ప్రారంభ కార్యక్రమం నందమూరి బాలకృష్ణ , ప్రొడ్యూసర్ శిరీష్ చేతులు మీదగా చాలా ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. కొన్ని ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ థియేటర్ ని మళ్ళీ ఇలా పునః ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు. ఇక ఈ కార్యక్రమంలో తన తండ్రి నందమూరి తారక రామారావు గురించి మాట్లాడుతూ.. దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా కన్నతండ్రి కి ఈ శత జయంతి సందర్భంగా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. తారకరామ థియేటర్ కి ఎంతో గొప్ప చరిత్ర వుంది.

నాన్నగారు ఏది చేసిన చరిత్రలో నిలిచిపోయేటట్లు చేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. సునీల్ నారంగ్ గారు టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. ఇది ఇండస్ట్రీకి చాలా ఆరోగ్యకరమైనది. ఎంతమంది ఎన్నిసార్లు థియేటర్ కి వచ్చి సినిమా చుస్తారనేది ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు ఓటీటీ రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంపిటేషన్ వుంది. అందరం కలసి మంచి సినిమాలని అందించాలి. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కి వస్తారు. థియేటర్లో పొందే ఆనందమే వేరు అంటూ చెప్పుకొచ్చాడు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus