నందమూరి బాలకృష్ణ.. దివంగత స్టార్ హీరో, ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారి చిన్న కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. పెద్ద ఎన్టీఆర్ వారసులుగా కొంతమంది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా బాలకృష్ణ తప్ప.. ఇంకెవ్వరూ కూడా రాణించలేకపోయారు అనే చెప్పాలి. పెద్ద ఎన్టీఆర్… సినిమాల పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవారో.. బాలకృష్ణ కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు.. అలాంటి నిర్ణయాలే తీసుకుంటూ వస్తున్నారు. అందుకే ఈయన స్టార్ హీరోగా నిలబడగలిగారు.
‘అఖండ’ చిత్రానికి ముందు వరకు బాలకృష్ణ పారితోషికం కేవలం రూ.4 కోట్లు మాత్రమే అంటే ఎవ్వరైనా నమ్మగలరా? ‘అంత పెద్ద స్టార్ హీరోకి అంత తక్కువ పారితోషికం ఏంటి?’ అని ఎవ్వరైనా.. టక్కున అనేస్తారు. కానీ ఇది నిజం. దర్శకనిర్మాతలకు ఎప్పుడూ హీరోలు అందుబాటులో ఉండాలని పెద్ద ఎన్టీఆర్ ఎప్పుడూ చెబుతుండేవారు. బాలయ్య ఇప్పటివరకు అదే పాటిస్తూ వచ్చారు. ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు పారితోషికాలు పెంచినా అది తన స్వప్రయోజనాల కోసం కాదు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సదుపాయాల కోసం. సరే ఇలా బాలయ్య గొప్పతనం గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. బాలయ్య నటించిన గత 10 చిత్రాలు.. మరియు వాటి కలెక్షన్లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) లెజెండ్ :
బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఇది. ‘సింహా’ కంటే కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. రూ.32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.40.39 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
2) లయన్ :
సత్యదేవ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ మూవీ రూ.24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద రూ.16.8 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసి ప్లాప్ గా మిగిలింది.
3) డిక్టేటర్ :
శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ మూవీ రూ.27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. బాక్సాఫీస్ వద్ద రూ.20.6 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసి ప్లాప్ గా మిగిలింది.
4) గౌతమీపుత్ర శాతకర్ణి :
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ 100వ చిత్రంగా రూపొందిన ఈ మూవీ రూ.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. బాక్సాఫీస్ వద్ద రూ.50.89 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. అప్పటివరకు బాలకృష్ణ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన మూవీ ఇదే కావడం విశేషం.
5) పైసా వసూల్ :
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ రూ.32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. రూ.18.72 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్ గా మిగిలింది.
6) జై సింహా :
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీ రూ.27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి… రూ.29 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది.
7) ఎన్టీఆర్ కథానాయకుడు :
ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగంగా రూపొందిన ఈ చిత్రం రూ.70 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి… బాక్సాఫీస్ వద్ద రూ.20.61 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బాలకృష్ణ కెరీర్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ చిత్రానికే..! కానీ పెద్ద డిజాస్టర్ అయ్యింది.
8) ఎన్టీఆర్ మహానాయకుడు :
ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగంగా రూపొందిన ఈ చిత్రం రూ.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి… బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.3.9 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఇదే..!
9) రూలర్ :
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ రెండో చిత్రం.. రూ.24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి… బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.10.05 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
10) అఖండ :
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ మూడో చిత్రం రూ.54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి .. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.73.29 కోట్ల షేర్ ను రాబట్టి… బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
11) వీరసింహారెడ్డి :
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ మూవీ రూ.68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి… బాక్సాఫీస్ వద్ద 8 రోజులకు గాను రూ.69 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. రానున్న రోజుల్లో ఈ మూవీ ‘అఖండ’ కలెక్షన్స్ ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి.