Balakrishna: హాట్ టాపిక్ అయిన బాలయ్య లేటెస్ట్ పిక్.. మేటర్ ఏంటంటే?
- October 10, 2024 / 08:17 PM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ (Balakrishna) సూపర్ హీరోగా కనిపించబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఎందుకంటే.. బాలయ్య సూపర్ హీరో గెటప్లో ఉన్న ఓ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. చూస్తుంటే ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్..లానే ఉంది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ (Gautamiputra Satakarni) సినిమాలోని స్టిల్స్ నుండి బాలయ్య ఫేస్ ను తీసుకొచ్చి.. ఓ హాలీవుడ్ సినిమాలోని హీరో పోస్టర్ కి అతికించారు. ప్రస్తుతం బాలయ్య వేరే గెటప్లో ఉన్నారు.
Balakrishna

బాబీ (Bobby) దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. అందులో బాలయ్య సరికొత్త గెటప్లో కనిపించబోతున్నారు. గ్లింప్స్ కూడా బయటకు వచ్చింది. సో ఇది ఒరిజినల్ కాదు అనడానికి ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదు. ‘అయితే సూపర్ హీరోగా బాలయ్య కనిపించబోతున్నారు’ అనే వార్త నిజమే అంటున్నారు చాలా మంది. అది ‘అన్ స్టాపబుల్ 3’ కోసం అయ్యుండొచ్చు. త్వరలోనే సీజన్ 3 ప్రారంభం కానుంది. బాలయ్యకి సంబంధించి ప్రోమో షూట్ ఫినిష్ అయ్యింది.

మొదటి ఎపిసోడ్ అల్లు అర్జున్ తో (Allu Arjun) అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరోపక్క ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది ‘ఆదిత్య 369’ (Aditya 369) సినిమాకు సీక్వెల్ అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ అది ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ లో భాగమని వెల్లడించారు. ఏదైనప్పటికీ కూడా అందులో బాలకృష్ణ అయితే ఒక చిన్న గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు టాక్ గట్టిగానే వినిపిస్తోంది. బహుశా అందులో కూడా బాలకృష్ణ సూపర్ హీరోగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
















