నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలయ్య నటించనున్న కొత్త సినిమాకు ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని జూన్ 8న గ్రాండ్‌గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమాకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, మళ్లీ అదే కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్నారు నిర్మాతలు. ఈసారి కథలో మరింత మాస్ మసాలా ఉండేలా స్క్రిప్ట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
గోపీచంద్ ఇప్పటికే బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా స్టోరీలో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, పదినెలల్లో సినిమా పూర్తి చేయాలనే టార్గెట్‌ను మేకర్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మేకింగ్ స్పీడ్ అందరికీ తెలిసిందే. గత చిత్రాల్లో ఆయన వేస్ట్ టైమ్ లేకుండా ప్రొఫెషన్‌తో ఫినిష్ చేశారు. ఇక ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ 2′(Akhanda 2) షూటింగ్‌లో ఉన్నారు. సెప్టెంబర్‌లో రిలీజ్ ప్రకటించినా, వాస్తవంగా దానిని అక్టోబర్ దసరాకు వాయిదా వేసే అవకాశం ఉందని టాక్.
ఈ సినిమా విడుదల పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని సినిమాకు డేట్లు కేటాయించనున్నారని తెలుస్తోంది. జూన్ 8న ప్రారంభోత్సవం జరిగినా, ప్రధాన షూటింగ్ మాత్రం అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఇతర సినిమాల ప్రారంభానికి కూడా జూన్ నెల చాలా కీలకంగా మారింది. శ్రావణ మాసం రాకముందే ఎక్కువ చిత్రాలు లాంచ్ చేయాలని నిర్మాతలు చూస్తున్నారు. వర్షాకాలం, ముహూర్తాల కొరత వల్ల జూన్ నెలను బిజీగా మార్చేస్తున్నారు.
ఈ క్రమంలో బాలయ్య సినిమాకు కూడా ఇదే ఉత్తమ సమయం కావడంతో జూన్ 8న లాంచ్ ఫిక్స్ చేశారు. ఈ కొత్త సినిమా బలంగా మాస్ కంటెంట్‌తో రూపొందనున్నట్లు టాక్. బాలయ్యకు మరో మాస్ హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో గోపీచంద్ ప్లాన్ వేసినట్లు సమాచారం. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ పరంగా కూడా సినిమాకు భారీగా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఫైనల్‌గా చెప్పాలంటే, బాలకృష్ణ ఇప్పుడు టైమ్ వృథా చేయకుండా వరుసగా మాస్ సినిమా లైనప్‌తో బిజీగా ముందుకు సాగుతున్నారు.