SJ Suryah: ఆ సినిమాలన్నీ బాషా మూవీ నుంచి పుట్టాయన్న ఎస్జే సూర్య.. కానీ?

సౌత్ ఇండియాలో నటుడిగా, దర్శకుడిగా ఎస్జే సూర్య (SJ Suryah) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్జే సూర్య మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇంద్ర (Indra) , బాహుబలి2 (Baahubali 2) సినిమాలు బాషా మూవీ నుంచి పుట్టినవే అంటూ ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. సరిపోదా శనివారం మూవీ స్టోరీ లైన్ ను ఇప్పటికే ఎస్జే సూర్య రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

SJ Suryah

యాక్షన్ జోనర్ లో ఏ సినిమా తెరకెక్కినా అది బాషా మూవీ నుంచి తీసుకున్నదే అని అన్నారు. ఇంద్ర మూవీ, బాహుబలి2 మూవీ, బాలయ్య (Nandamuri Balakrishna) నటించిన కొన్ని సినిమాలు సైతం బాషా మూవీ నుంచి వచ్చాయని ఎస్జే సూర్య వెల్లడించారు. సరిపోదా శనివారం మూవీ సైతం ఆ ఫార్మాట్ మూవీ అయినప్పటికీ కొత్తగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే బాషా మూవీకి ముందు కూడా ఆ తరహా సినిమాలు వచ్చాయని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) సరిపోదా శనివారం మూవీ కథ చెప్పిన సమయంలో థ్రిల్ కు గురయ్యానని ఎస్జే సూర్య అన్నారు. దర్శకుడు ఈ సినిమా కథను కొత్తగా రాసుకున్నాడని ఎస్జే సూర్య చెప్పుకొచ్చారు. సరిపోదా శనివారం మూవీని ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆయన తెలిపారు. ప్రియాంక మోహన్ (Priyanka Mohan) కానిస్టేబుల్ డ్రెస్ లో కూడా అందంగా కనిపించారని ఎస్జే సూర్య వెల్లడించారు. ప్రియాంక మంచి నటి అని ఎస్జే సూర్య తెలిపారు.

సరిపోదా శనివారం బుకింగ్స్ ఇప్పటికే మొదలు కాగా ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాలి. నైజాంలో దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నాని పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమా సక్సెస్ కావడానికి తన వంతు కష్టపడుతున్నారు. సరిపోదా శనివారం ఐదు షోలు ప్రదర్శితం కానున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఎట్టకేలకు స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి.. ఎవరూ ఊహించిన విధంగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus