స్టార్ హీరో బాలకృష్ణ సినీ నటుడిగా ప్రేక్షకులకు దగ్గరై ప్రేక్షకులను అలరించే, మెప్పించే పాత్రలలో నటిస్తూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. బాలయ్య సీఎం పాత్రలో కనిపించనున్నారని దర్శకుడు పరశురామ్ బాలయ్యను సీఎంగా చూపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే బాలయ్య మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బాలయ్య సీఎం పాత్రలో నటిస్తే మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
హీరోలు సీఎం పాత్రలలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో బాలయ్య ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చంద్రబాబును పోలి ఉన్న పాత్రలో బాలయ్య కనిపిస్తారని కామెంట్లు వినిపిస్తాయి. అయితే ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వీర సింహారెడ్డి మూవీ షూట్ ను పూర్తి చేసిన బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి మూవీ షూట్ లో పాల్గొననున్నారు.
ఈ మూవీ షూట్ శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆరు నెలల గ్యాప్ లో బాలయ్య నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాల తర్వాత పరశురామ్, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య నటించనున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కనుందని తెలుస్తోంది.
బాలయ్య వరుసగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం. బాలయ్య పారితోషికం 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు హీరోగా బాలయ్యే కరెక్ట్ ఆప్షన్ అని దర్శకనిర్మాతల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!