Balayya Babu: వైసీపీ మీద మరో పంచ్‌! వేసిన బాలయ్య.. ఈసారి డైరక్టర్‌ను లాగి..!

‘వీర సింహా రెడ్డి’ సినిమా చూసినవాళ్లకు ఒకానొక సమయంలో ఈ డైలాగ్‌కి, సినిమాకు సంబంధం ఏంటి? అనే డౌట్‌ వస్తుంది. కారణం.. ఆ సన్నివేశానికి, ఆ డైలాగ్‌కి ఎక్కడా పెద్ద సంబంధం కనిపించకపోవడమే. అలా సినిమాలో చాలా డైలాగ్‌లు ఉన్నాయి. డైలాగ్‌లో ఉన్న ఎమోషన్‌, వాడి, వేడి వల్ల అభిమానులు వాటిని ఎంజాయ్‌ చేశారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అయితే వాటిని నిజ జీవితంలో వాడేశారు. ఇప్పడు బాలకృష్ణ ఏకంగా నిజ జీవితంలోనే వైసీపీ ప్రభుత్వానికి డైలాగ్‌ కౌంటర్‌ వేసేశారు.

‘వీర సింహా రెడ్డి’ సినిమా సంక్రాంతికి వచ్చి భారీ విజయం అందుకున్న నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ సుమార అర్ధ గంట సేపు ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ దర్శకుడు గోపీచంద్‌ మలినేని గురించి చెప్పుకొచ్చారు. ‘‘గోపీచంద్‌ మలినేని నా అభిమాని. నా సినిమా ‘సమరసింహారెడ్డి’ చూడటానికి వెళ్లి దెబ్బలు తిన్నారు. కారణమేంటో చెబితే ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేస్తారు. కేసులు బుక్‌ చేయడం ఇప్పుడు చాలా తేలిక కదా’’ అంటూ కౌంటర్‌ వేశారు.

దీంతో సోషల్‌ మీడియాలో మరోసారి వైసీపీ వర్సెస్‌ టీడీపీ అనే కాన్సెప్ట్‌ బయటకు వచ్చింది. నిజ జీవితంలో జరిగిందే బాలయ్య సినిమాల్లో చూపించారు అని టీడీపీ వాళ్లు అంటుంటే.. తప్పు చేయకుండా కేసులు ఎందుకు పెడతారు అంటూ వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు. అంతేకాదు గతంలో టీడీపీ ప్రభుత్వమే ఇలా తప్పులు చేయకుండా కేసులు పెట్టింది అని వైసీపీ జనాల ఆరోపిస్తున్నారు. దీంతో మరోసారి సోషల్‌ మీడియాలో వాడివేడిగా మాటల యుద్ధం జరుగుతోంది.

అసలు గోపీచంద్‌ మలినేని ‘సమర సింహా రెడ్డి’ అప్పుడు ఏం చేశారు అనేది చూస్తే… ‘‘1999లో ‘సమర సింహా రెడ్డి’ సినిమా రిలీజ్‌ రోజున గోపీచంద్‌ మలినేని ఒంగోలులోని విజయదుర్గ థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లారు. అయితే తొలి షో సమయంలో అక్కడ గొడవ జరగడంతో గోపీచంద్‌ను అరెస్టు చేసి రెండు రోజులు లాకప్‌లో పెట్టారు. ఆ తర్వాత విడిచిపెట్టారు’’ అని గతంలో గోపీచంద్‌ మలినేని చెప్పారు.

థియేటర్‌ దగ్గర జనాల్ని అదుపు చేయడానికి వచ్చిన ఐడీ పార్టీ పోలీసులను గోపీచంద్‌ మలినేని బ్యాచ్‌ పక్కకు నెట్టేశారు. దాంతో మొత్తం పోలీసుల వచ్చి అరెస్టు చేశారట. ఈ విషయం బాలయ్య ముందే ‘అన్‌స్టాపబుల్‌ 1’లో చెప్పారు గోపీచంద్‌ మలినేని. ఆ విషయం గుర్తు లేదేమో బాలయ్య ఇప్పుడు ‘వీర సింహా రెడ్డి’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో అన్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus