నటసింహం నందమూరి బాలకృష్ణకు (Balakrishna) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సీనియర్ హీరోల్లో వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న హీరో బాలయ్య మాత్రమే కాగా సీనియర్ హీరోలెవరూ ఇప్పట్లో ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య ఇప్పటివరకు 108 సినిమాలలో నటించారు. శ్లోకాలు, పద్యాలు, కఠినమైన డైలాగ్స్ ను సైతం అలవోకగా చెప్పగల ప్రతిభ బాలయ్య సొంతమనే సంగతి తెలిసిందే.
సైన్స్ ఫిక్షన్, జానపదం, పౌరాణికం, సాంఘికం ఇలా అన్ని జానర్ల సినిమాలలో నటించిన హీరో బాలయ్య కావడం గమనార్హం. కోదండరామిరెడ్డి (A. Kodandaramireddy) డైరెక్షన్ లో బాలయ్య ఏకంగా 13 సినిమాలలో నటించారు. స్టార్ హీరో బాలయ్య 17 సినిమాల్లో డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. భవిష్యత్తులో సైతం ఈ రికార్డ్ బాలయ్య పేరు మీదే ఉంటుంది. ఒక సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో నటించారు.
టైటిల్ లో సింహా ఉన్న బాలయ్య సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం. భవిష్యత్తులో దర్శకుడిగా మారాలని బాలయ్య భావిస్తుండగా ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. రాజకీయాల్లో సైతం బాలయ్య చెరగని ముద్ర వేశారు. వరుసగా మూడుసార్లు బాలయ్య ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రశంసలు అందుకున్నారు. బాలయ్యకు మంత్రి పదవి దక్కుతుందో లేదో అనే చర్చ జరుగుతుండగా ఆ చర్చ హాట్ టాపిక్ అవుతోంది.
బాలయ్య కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. మాస్ సినిమాలతో వరుస విజయాలు సాధిస్తూ విజయాలను సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య పుట్టినరోజు కానుకగా బాలయ్య సినిమాల నుంచి వచ్చిన అప్ డేట్స్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించడం గమనార్హం.