బాలకృష్ణ కి ఎన్టీఆర్ బైక్ అమ్మిన డబ్బులు
- April 11, 2017 / 07:29 AM ISTByFilmy Focus
ఎన్టీఆర్ డబ్బులు బాలకృష్ణ తీసుకోవడం ఏమిటి?.. అని అనుకుంటున్నారా!! ఇది నిజం. బాలకృష్ణ చేతికి ఎన్టీఆర్ డబ్బులు వెళ్లాయి. అదెలాగంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘జనతాగ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అభిమానులకోసం పెద్ద పోటీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్వహించారు. ఇందులో గెలిచిన వారిని అనేక కానుకలతో పాటు, “జనతాగ్యారేజ్” సినిమాలో ఎన్టీఆర్ వాడిన రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ బైక్ బహుమతిగా అందిస్తామని ప్రకటించారు. ఉత్సాహంగా లక్షలమంది అభిమానులు పోటీలో పాల్గొన్నారు.
చిత్ర బృందం చెప్పిన ప్రకారమే కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన నల్గొండకు చెందిన రాజ్ కుమార్ రెడ్డికి బైక్ ని అందించారు. ఎక్కువమంది ఈ పోటీలో పాల్గొనడం వల్ల నిర్వాహకుల చేతికి సుమారు 10 లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని నిర్మాతలు, దర్శకుడు కొరటాల శివతో కలిసి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చారు. ఆ చెక్ ను హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ చేతికి అందించారు. సో .. ఆ విధంగా ఎన్టీఆర్ డబ్బులు బాలకృష్ణ చేతికి వెళ్లాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















