Balayya Babu: థియేటర్ల సమస్యపై బాలయ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

అన్ స్టాపబుల్ సీజన్2 ఫస్ట్ సీజన్ ను మించి సక్సెస్ కాగా ఈ షో ఐదో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితం రిలీజైంది. ప్రోమోలో బాలయ్య వివాదాస్పద ప్రశ్నలను నవ్వుతూ అడగగా ఆ ప్రశ్నలకు అల్లు అరవింద్, సురేష్ బాబు తమదైన శైలిలో జవాబులు ఇచ్చారు. ఈ నెల 2వ తేదీన రాత్రి 9 గంటల నుంచి ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా ఈ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అల్లు అరవింద్, సురేష్ బాబు ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాలయ్య మాట్లాడుతూ నాకు మిమ్మల్ని చూస్తుంటే భలే దొంగ, మంచి దొంగ ఇలాంటి సినిమాలన్నీ గుర్తుకొస్తున్నాయని చెప్పగా సురేష్ బాబు మాట్లాడుతూ కథానాయకుడు అలాంటి మంచి సినిమాలు చెప్పండి బాబు అని అన్నారు. మనిద్దరి కాంబినేషన్ మాత్రమే బ్యాలెన్స్ అని బాలయ్య అల్లు అరవింద్ తో చెప్పగా మీరు, చిరంజీవి గారిని కలిపి కాంబినేషన్ లో సినిమా తీయాలని ఉందని ఎదురుచూస్తున్నానని అల్లు అరవింద్ సమాధానమిచ్చారు.

నేను, చిరంజీవి కలిసి సినిమాలో నటిస్తే ఆ సినిమా పాన్ వరల్డ్ సినిమా అవుతుందని బాలయ్య చెప్పుకొచ్చారు. చిరంజీవితో కలిసి నటించడానికి సిద్ధమేనని బాలయ్య చెప్పగా చిరంజీవి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. ఈ హీరోలను కలిపే దర్శకుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ఆ తర్వాత రాఘవేంద్రరావు ఎంట్రీ ఇచ్చి న్యూటన్ ఆపిల్ తో గ్రావిటీ కనిపెట్టాడని నేను ఆపిల్ ఎక్కడ పడాలో కనిపెట్టానని కామెంట్లు చేశారు.

మరోవైపు సంక్రాంతి థియేటర్ల విషయంలో వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బాలయ్య సంక్రాంతికి నా సినిమాకు ఎన్ని థియేటర్లు ఇస్తున్నారంటూ అల్లు అరవింద్, సురేష్ బాబులను అడగగా ఆ ప్రశ్నకు అల్లు అరవింద్ పకపకా నవ్వేశారు. థియేటర్ల ఇష్యూ గురించి బాలయ్య పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం. ఈ ప్రశ్నకు అల్లు అరవింద్, సురేష్ బాబు నుంచి ఎలాంటి జవాబు వస్తుందో చూడాల్సి ఉంది. ఆ నలుగురిలో ఇద్దరు మీరేగా అంటూ బాలయ్య అడగగా అల్లు అరవింద్, సురేష్ బాబు ఎలాంటి జవాబు ఇచ్చారో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus