నందమూరి బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమరసింహా రెడ్డి’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘సత్యనారాయణ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై చెంగల వెంకట్రావ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ డైలాగులు అందించగా కె.విజయేంద్ర ప్రసాద్, రత్నాకర్ లు కథ అందించారు. 1999వ సంవత్సరం జనవరి 13న విడుదలైన ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న రికార్డులను తుడిచిపెట్టేసి సంచలనాలు సృష్టించింది.
రూ.6 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం రూ.22 కోట్లకు పైగా షేర్ ను నమోదు చేసింది. ఇంత సూపర్ హిట్ చిత్రంలో నటించే అవకాశం వస్తే చేతులారా వద్దనుకున్నాడట మరో స్టార్ హీరో..! అవును ‘సమరసింహా రెడ్డి’ కి ఫస్ట్ ఛాయిస్ బాలకృష్ణ కాదు. ముందుగా దర్శకుడు వేరే హీరోని సంప్రదించాడు. అతను మరెవరో కాదు విక్టరీ వెంకటేష్. అవును ముందుగా దర్శకుడు బి.గోపాల్ ‘సమరసింహారెడ్డి’ కథని వెంకీకి వినిపిస్తే..
‘ఈ కథ నాకు సెట్ అవ్వదు.నాకంటే ఎక్కువగా మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో చేస్తే బాగుంటుంది’ అని సూచించాడట. దాంతో బాలకృష్ణకు ఈ కథని చెప్పి ఓకే చేయించుకున్నారు బి.గోపాల్. వెంకటేష్ చేస్తే ఈ మూవీ ఎలా ఉంటుందో అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే బాలయ్యకి ఈ కథ ఓ టైలర్ మెడ్ లా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. అతను ఈ మూవీలో నట విశ్వరూపాన్ని చూపించాడు.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!