స్టార్ హీరో బాలకృష్ణ అఖండ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించి మెప్పించారు. మురళీకృష్ణ, శివుడు పాత్రలకు బాలయ్య పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. సింహా, లెజెండ్ సినిమాలలో బాలయ్యను అందంగా చూపించిన బోయపాటి శ్రీను అఖండ సినిమాలో ఆ సినిమాలకు మించి అందంగా చూపించారు. అఖండ సినిమాలో మురళీకృష్ణ పాత్రకు బాలయ్య పెట్టుకున్న విగ్గు పర్ఫెక్ట్ గా సూట్ అయింది. విగ్గు సరిగ్గా కుదరకపోవడం వల్ల బాలయ్య గత సినిమాల విషయంలో కొన్నిసార్లు విమర్శలు వచ్చాయి.
తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖండ సినిమాలో కేవలం విగ్గుల కోసమే 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సినిమా కోసం బాలయ్య మూడు విగ్గులు వాడారని ఒక్కో విగ్గు ధర 13 లక్షల రూపాయలు అని సమాచారం. బాలయ్య కోసం ముంబై నుంచి హెయిర్ డ్రెస్సర్ ను పిలిపించారని హెయిర్ డ్రెస్సర్ ఈ సినిమాకు పని చేయడానికి 12 లక్షల రూపాయలు తీసుకున్నారని సమాచారం. అయితే ఎక్కువ మొత్తం ఖర్చు చేసినా బాలయ్య లుక్ సినిమాకు ప్లస్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న అఖండ హవా మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. దసరాకు అఖండ రిలీజై ఉంటే ఈ సినిమాకు మరింత ఎక్కువ కలెక్షన్లు వచ్చేవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది బాలయ్య రెండు సినిమాలతో బిజీ కానున్నారు. మరోవైపు బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్యతో సినిమాలను తెరకెక్కించడానికి స్టార్ డైరెక్టర్లు ఆసక్తి చూపుతుండటం గమనార్హం.