Balakrishna: మరోసారి సందడి చేస్తున్న ‘అఖండ’ జోడి.. వీడియో వైరల్.!

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా ‘అఖండ’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2021 డిసెంబర్ 2న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో శరణ్య అనే ఐ.ఏ.ఎస్ అధికారి పాత్రలో నటించి మెప్పించింది. జై బాలయ్య సాంగ్ లో ఈమె వేసిన స్టెప్పులు మాస్ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించాయి. సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఈ హిట్ పెయిర్ మళ్ళీ దర్శనమిచ్చింది. అయితే అది సినిమా కోసం కాదు. ఓ యాడ్ కోసం. ‘వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్’ అనే నగల సంస్థ కోసం ఓ యాడ్ లో పాల్గొన్నారు. ఈ యాడ్ కు సంబంధించిన మేకింగ్ వీడియో తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ యాడ్ లో బాలయ్య చాలా అందంగా కనిపిస్తున్నాడు. ప్రగ్యా కూడా పట్టుచీర కట్టుకుని ఓ పెళ్లి కూతురిలా ముస్తాబయ్యింది.

అయితే ఈ వీడియోలో ఎందుకో ప్రగ్యా కన్నా బాలయ్యే చూడటానికి అందంగా కనిపిస్తున్నాడు. ఈ యాడ్ లో బాలయ్య కోసం మంచి విగ్గు వాడినట్టు స్పష్టమవుతుంది. బాలయ్య నటించిన మొట్ట మొదటి యాడ్ ఇది. ఈ యాడ్ కు సంబంధించిన వీడియో, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ యాడ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus