ఇప్పుడంటే సోషల్ మీడియా హవా పెరిగింది. సో.. అభ్యంతరకరమైన మాటలు వంటి సోషల్ మీడియాలో మాట్లాడినా, సినిమాల్లో ఘోరమైన సన్నివేశాలు వంటివి పెట్టినా.. పెద్ద రచ్చ జరిగిపోతుంది. మొన్నామధ్య సోషల్ మీడియాలో ఓ చిన్న పాప గురించి, ఆమె తండ్రి గురించి .. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఘోరమైన కామెంట్లు చేస్తే.. వాళ్ళని జైలుకు పంపిన సందర్భాలు చూశాం. అలాగే ప్రభాస్ (Prabhas) వంటి పాన్ ఇండియా స్టార్ హీరో నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) వంటి సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, మాటలు ఉంటే..
Balakrishna
కొన్ని ఏరియాల్లో ఆ సినిమా ప్రదర్శనని నిలిపివేయడం కూడా జరిగింది. అయితే సోషల్ మీడియా అంతగా ప్రాచుర్యం చెందని రోజుల్లో సైతం సినిమాలను నిషేధించడం జరిగిందనే సంగతి మీకు తెలుసా? నమ్మడానికి కష్టంగా ఉన్నా.. అది నిజమే..! బాలకృష్ణ (Balakrishna) నటించిన మొదటి సినిమా ‘తాతమ్మ కల’ సినిమా నిషేధానికి గురైంది. బహుశా ఈ విషయం ఎక్కువమందికి తెలిసుండకపోవచ్చు. విషయం ఏంటంటే.. అప్పట్లో కుటుంబ నియంత్రణ అనే అంశాన్ని ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి.
‘ఇద్దరు ముద్దు ఆ పై వద్దు’ అనే నినాదంతో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ‘తాతమ్మ కల’ సినిమా కాన్సెప్ట్ ఇందుకు బిన్నంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులను ఆధారం చేసుకుని పిల్లల్ని ఎంతమందినైనా కనొచ్చు అనేది ఆ సినిమా యొక్క థీమ్.ఎన్టీఆర్ ఈ సినిమాకి కథ అందించడం జరిగింది. రిలీజ్ టైంకి సెన్సార్ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొన్ని నెలల పాటు ఈ సినిమా విడుదలకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ (Sr NTR) ఈ విషయంపై పోరాడి సెన్సార్ వారి అనుమతి తెచ్చుకొని 1974 ఆగస్టు 30న ‘తాతమ్మ కల’ ని విడుదల చేశారు. విడుదల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుని సక్సెస్ అందుకుంది. ఓ విధంగా సెన్సార్ సమస్యల వల్లే.. ఈ సినిమాకి బాగా పబ్లిసిటీ జరిగినట్టు చెప్పుకోవాలి.