Shruti Haasan: శృతిపై కోపంగా ఉన్న బాలయ్య ఫ్యాన్స్.. కారణమిదే?

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. శృతిహాసన్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో బలుపు, క్రాక్ సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. బాలయ్య శృతి కలిసి తొలిసారి నటిస్తుండగా ఈ సినిమా కోసం శృతిహాసన్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా శృతిహాసన్ చేసిన పని బాలయ్య అభిమానులకు కోపం తెప్పిస్తుండటం గమనార్హం.

శృతిహాసన్ కావాలని చేశారో లేక తెలియకుండా చేశారో అనే క్లారిటీ లేకపోయినా బాలయ్య ఫ్యాన్స్ మాత్రం శృతిహాసన్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్న శృతిహాసన్ గోపీచంద్ మలినేనితో మూడోసారి కలిసి పని చేయడం సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. అయితే ట్విట్టర్ లో చేసిన ట్వీట్ లో శృతిహాసన్ బాలకృష్ణ పేరును ప్రస్తావించకపోవడం చర్చకు దారి తీస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ శృతిహాసన్ బాలయ్య పేరును యాడ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు శృతి పద్ధతి మార్చుకోవాలని సూచనలు చేస్తున్నారు.

మరి కొందరు నెటిజన్లు శృతి హాసన్ ఈ విధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో అవకాశాలు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీతో శృతి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందేమో చూడాల్సి ఉంది. తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తున్నా శృతిహాసన్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus