Balakrishna: బాలయ్య లైఫ్ లో ఆ పేరు ప్రత్యేకమా.. ఆశ ఎవరంటే?

స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా ఈ షో వల్ల ఆహా ఓటీటీకి రికార్డ్ స్థాయిలో సబ్ స్క్రిప్షన్లు పెరిగాయని సమాచారం అందుతోంది. అన్ స్టాపబుల్ షో తాజా ఎపిసోడ్ కు కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాధిక గెస్ట్ లుగా హాజరు కాగా కామన్ ఫ్రెండ్స్ మరో ఇద్దరు ఎపిసోడ్ చివర్లో హాజరై సర్ప్రైజ్ ఇచ్చారు.
ఆ స్నేహితులలో ఒక స్నేహితుడు మాట్లాడుతూ ఆశ గుర్తుందా?

అని అడగగా బాలయ్య ఎందుకు గుర్తు లేదు అని చెబుతూ ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి అంతే కదా అని చెప్పగా బాలకృష్ణ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాడని మీకు తెలియని విషయం ఇంకొకటి ఉందని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు. అతను అలా చెప్పిన వెంటనే బాలయ్య ఆ వ్యక్తి నోరు మూసేశారు. బాలయ్య జీవితంలో ఆశ ఎవరనే ప్రశ్న ఈ షో ద్వారా వ్యక్తం కాగా ఆశ బాలయ్య క్లాస్ మేట్ అని తెలుస్తోంది.

బాలయ్య, ఆశ మధ్య ఏదో ఆసక్తికర ఘటన ఉండటం వల్లే అతని ఫ్రెండ్ ఈ విధంగా కామెంట్ చేశారని మరికొందరు చెబుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఆశ బాలయ్య క్రష్ అయ్యి ఉండవచ్చని కామెంట్లు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బాలయ్య ఆశ అనే పేరు వెనుక అసలు కథను చెబుతారేమో చూడాలి. తన సినీ కెరీర్ లో మోస్ట్ డిఫికల్ట్ మూవీ ఏదనే ప్రశ్నకు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అని చెప్పారు.

బాలయ్య హీరో అవుతాడని నేను అనుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పగా నువ్వు సీఎం అవుతాయని నేను కూడా అనుకోలేదని బాలయ్య కౌంటర్ ఇచ్చారు. డబ్బు విషయంలో నాకు స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవని బాలయ్య అన్నారు. బాలయ్య వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus