వావ్… ఈ కాంబినేషన్ సెట్ అయితే రచ్చ రచ్చే…!

బాలకృష్ణ తన 106 వ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై ఎం.రవీందర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ‘రూలర్’ తో బాలయ్య… ‘వినయ విధేయ రామ’ చిత్రంతో బోయపాటి శ్రీను ఇద్దరూ డిజాస్టర్లు మూటకట్టుకుని ఉన్నారు. దీంతో కచ్చితంగా వీళ్ళు మంచి హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని తెలుస్తుంది.

ఈ చిత్రంలో బాలయ్య డబుల్ రోల్ లో కనిపించనున్నాడు అని తెలుస్తుంది. ఓ పాత్రలో పొలిటికల్ లీడర్ గా మరో పాత్రలో ఆఘోరాగా కనిపించనున్నాడు అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం కథ ప్రకారం ఓ యంగ్ హీరోకి సరిపడా రోల్ ఒకటి ఉందట. అందుకు గాను మొదట ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు అని నవీన్ పోలిసెట్టి తేల్చి చెప్పేసాడు.

అయితే ఇప్పుడు ‘వంగవీటి’ మరియు ‘జార్జ్ రెడ్డి’ వంటి సినిమాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సందీప్ మాధవ్ ను తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. సందీప్ కూడా ఈ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే సమాచారం. అలా అయితే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరి దీనిని చిత్ర యూనిట్ సభ్యులు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus