NBK107: సప్తగిరి పై బాలయ్య కౌంటర్లు.. వైరల్ అవుతున్న వీడియో..!

నందమూరి బాలకృష్ణ టాలీవుడ్లో ఉన్న సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు.దివంగత స్టార్ హీరో నందమూరి తారక రామారావు తనయుడిగా కెరీర్ ను మొదలు పెట్టినప్పటికీ తన సొంత ట్యాలెంట్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అభిమానులు, ఇండస్ట్రీ పెద్దలు ముద్దుగా బాలయ్య అని పిలుచుకునే ఈ స్టార్ హీరో.. బయట జనాలకు కోపిష్టి గాను, అభిమానుల పై వట్టి పుణ్యానికి చేయి చేసుకునే మూర్ఖత్వంతో నిండిన వ్యక్తిగానూ కనిపిస్తాడు.

కానీ బాలయ్య బాబు మనసు బంగారం. నిజజీవితంలో బాలయ్య ఎంతో మందికి ప్రాణదానం చేశాడు. కానీ ఇలాంటి విషయాలను పబ్లిసిటీ చేసుకోవడానికి పీఆర్ టీం వంటి వాటిని బాలయ్య ఏర్పాటు చేసుకోలేదు. సినిమా సెట్స్ లో అయితే ఆయన ప్రవర్తన పెద్దింటి ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా ఉండదు. కామన్ మెన్ కంటే కూడా నేచురల్ గా ఉంటారు బాలయ్య. తాజాగా ఆయన 107 వ సినిమా సెట్స్‌ లో చేసిన సందడి చూస్తే ఈ విషయం క్లియర్ గా తెలుస్తుంది.

దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ స్పాట్లో సప్తగిరితో ఓ ఫన్నీ టాస్క్ చేశారు బాలకృష్ణ. ఈ క్రమంలో ఆయన సప్తగిరితో కలిసి పౌరాణిక చిత్రాల్లోని ఓ భారీ డైలాగ్ చెప్పడానికి ప్రయత్నించారు. అప్పుడు బాలయ్య దాన్ని మధ్యలో ఆపడం, సప్తగిరి ఆ డైలాగ్ ని కంటిన్యూ చేయడంతో…. సప్తగిరి నైపుణ్యానికి ఫిదా అయిపోయిన బాలయ్య..

‘ఓసారి.. నీ కాళ్లు పైకి ఎత్తరా.. దండం పెడతా’ అంటూ మరింత క్రియేట్ చేశారు. చివరికి సప్తగిరి బాలయ్య కాళ్ళ పై పడి.. కిందనే కూర్చుకున్నాడు. ఇలా వీరిద్దరూ నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. దీన్ని మీరు కూడా ఓ లుక్కేయండి :

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus