నిర్మాతగా మారనున్న నందమూరి నటసింహం!
- July 28, 2017 / 08:46 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో నందమూరి నట సింహం బాలయ్య రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…అయితే దాదాపుగా 30ఏళ్ల సుధీర్గ నటనానుభవం ఉన్న బాలయ్య తన 100వ సినిమాతో చరిత్ర సృష్టించాడు…అయితే 101వ సినిమాగా పైసా వాసూల్ సినిమా చేస్తున్న బాలయ్య…పూరీ దర్శకత్వంలో మంచి యంగ్ హీరోగా కనిపిస్తున్నాడు…ఇదిలా ఉంటే హీరోగా మంచి ఊపు మీద దూసుకెళ్తున్న బాలయ్య, నిర్మాతగా మారే ఆలోచనల్లో ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న వాదన…అప్పట్లో నర్తన శాల రీమేక్ తో ఆ రోజుల్లో నిర్మాతగా మారినప్పటికీ ఆ సినిమా అసలు మొదలు కూడా కాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల, అనుకోని ఇబ్బందుల వల్ల ఆ సినిమా ఆగిపోయింది…
ఇక తప్పని క్రమంలో ఆ ఆలోచనను అప్పట్లో విరమించుకుని హీరోగా సినిమాలు చేస్తూ వచ్చారు బాలయ్య. అయితే బాలకృష్ణ, ఇప్పుడు మళ్లీ నిర్మాతగా మారే ఆలోచన చేస్తున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. తనకి అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాతతో కలిసి కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారట. ఈ బ్యానర్ ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ వుండే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ… హీరోగా…ప్రజా ప్రతి నిధిగా మంచి ఫార్మ్ లో ఉన్న బాలయ్య నిర్మాతగానూ మారితే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా రాణించాలి అని మనస్పూర్తిగా కోరుకుందాం…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















