NBK107.. సినిమాకి భారీ ఆఫర్!

నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దసరా సీజన్ లో సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

కొన్నాళ్లక్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. దానికి తగ్గట్లే బిజినెస్ కూడా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కి మంచి రేటు పలికిందని తెలుస్తోంది. మొత్తం హక్కులను రూ.58 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఒక్క నాన్ థియేట్రికల్ రైట్స్ కే ఇంత మొత్తం రావడం బాలయ్య కెరీర్ లో ఇదే తొలిసారి. థియేట్రికల్ బిజినెస్ ఇంతకుమించి అవుతుందని భావిస్తున్నారు నిర్మాతలు.

బాలయ్య కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య మాస్ లుక్ తో అభిమానులను థ్రిల్ చేయబోతున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. అక్కడ శృతిహాసన్, బాలయ్యల మీద ఒక పాటను చిత్రీకరించారు. అలానే కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. అంతకంటే ముందే రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ సినిమా తరువాత బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఆ సినిమాను ఎనభై కోట్ల బడ్జెట్ లో నిర్మించాలనుకుంటున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus