Bandla Ganesh, Pawan Kalyan: ఆరోజే సమాధానం చెబుతానన్న బండ్ల గణేష్!

ఒకప్పుడు కమెడియన్ గా వెలుగు వెలిగిన బండ్ల గణేష్ నిర్మాతగా మారిన తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా పలు విజయాలు ఖాతాలో వేసుకున్న బండ్ల గణేష్ టెంపర్ సినిమా తర్వాత మరే సినిమాను నిర్మించలేదు. పవన్ తో ఒక సినిమాను నిర్మించాలని బండ్ల గణేష్ భావిస్తున్నా ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే పవన్ చేసిన కామెంట్లకు పలువురు సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభించినా బండ్ల గణేష్ మాత్రం ఆ కామెంట్ల గురించి స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్ దైవంలా భావిస్తారనే విషయం తెలిసిందే. అయితే బండ్ల గణేష్ ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ అభ్యర్థి పదవికి జీవితకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని బండ్ల గణేష్ తెలిపారు.

అక్టోబర్ 11వ తేదీన ప్రెస్ మీట్ పెడతానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. శ్వాస ఉన్నంత వరకు తన దైవం పవర్ స్టార్ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. బండ్ల గణేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ నుంచి అసభ్యకరమైన సందేశాలు వస్తున్నాయని పోసాని పేర్కొన్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus