Bandla Ganesh Speech: మళ్ళీ తన స్పీచ్ తో ఆకట్టుకున్న బండ్ల గణేష్..!

బండ్ల గణేష్ స్పీచ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈరోజు మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండ్ల గణేష్ పాల్గొని తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ … ” 23 ఏళ్లుగా ప్రకాష్ రాజ్‌ నాకు పరిచయం, కొన్ని వందల సార్లు ఆయన్ని చూసి ఇరిటేట్ అయ్యాను.. అలాగే కొన్ని లక్షల సార్లు ఆయన్ని ప్రేమించాను. ఆయన మంచి విలువలు కలిగిన వ్యక్తి, మా ఊరు షాద్ నగర్ వద్ద కొండారెడ్డి పల్లె అనే విలేజ్‌ని దత్తత తీసుకొని..

కోవిడ్ కష్ట సమయంలో ఎంతో మందిని తన సొంత డబ్బుతో ఆదుకున్నాడాయన. నాకు తెలిసిన ఆర్టిస్టుల పిల్లల పెళ్లిళ్లకు లక్షల రూపాయలు సాయం చేశాడు. అది నా కళ్లారా చూశాను. ప్రకాష్ రాజ్ లోకల్ కాదు.. నాన్ లోకల్ అని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు.ఇక్కడ పుట్టిన ప్రభాస్ ఈరోజు ఇండియాని ఏలుతున్నాడు. ఇక్కడ పుట్టిన రాజమౌళితో హాలీవుడ్లో సినిమాలు చేయమని అడుగుతున్నారు. గర్వపడాలి మనం. మేమంతా ‘మా’ మనుషులం.

27 సంవత్సరాల క్రితం చిరంజీవి గారి అధ్యక్షుడుగా ఏర్పాటు చేసిన ‘మా’లో ఇప్పటిదాకా చేసిన ప్రతి ప్రెసిడెంట్ చాలా బాగా పనిచేశారు. అయితే ప్రకాష్ రాజ్ ఏం చేసైనా 100 మైళ్ళు అవలీలగా పరుగెత్తి, ‘మా’ వృద్ధిలో భాగమవుతాడనే నమ్మకంతో నేను ఆయన వెనకాల నిలబడ్డాను. పేద కళాకారులకు ‘మా’ ఉంది అనే భరోసా కల్పించగల సమర్ధుడు ప్రకాష్ రాజ్. దయచేసి ‘మా’ ఎన్నికలు ముగిసేవరకు మా ప్యానెల్ వారిని యూట్యూబ్ ఇంటర్వ్యూలకి. డిబేట్ లకి పిలవకండి” అంటూ నవ్వులు పూయించారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus