Bandla Ganesh: బండ్ల గణేష్‌తో బేరసారాలు చేస్తున్నారా…!

  • September 8, 2021 / 02:41 PM IST

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) రాజకీయాలు, సాధారణ రాజకీయాలకు ఏ మాత్రం భిన్నం కాదని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మరోసారి అలాంటి సంఘటన జరిగింది. ఇంకొన్ని లూప్‌లో ఉన్నాయని అని కూడా అంటున్నారు. ఇదంతా బండ్ల గణేష్‌ రీసెంట్‌ స్టెప్స్‌ గురించే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ పోటీ చేస్తా అంటూ ఘనంగా చెప్పిన బండ్ల గణేష్‌… ప్యానల్‌ ప్రకటించాక తప్పుకున్నాడు. అంతేకాదు ఇప్పుడు వేరే ప్యానల్‌లోకి వెళ్తాడని భోగట్టా.

ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ తరపున జనరల్‌ సెక్రటరీ పదవి కోసం బండ్ల గణేష్‌ బరిలో దిగుతారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఆ స్థానంలో జీవిత రాజశేఖర్‌ వచ్చారు. దీంతో బండ్ల గణేష్‌ బయటికొచ్చి, స్వతంత్ర అభ్యర్థిగా ఆమె మీదే పోటీకి దిగుతా అని ప్రకటించారు. అయితే ‘బండ్ల గణేష్‌ ఆలోచన మారుతుందా…’ ఇప్పుడు ఈ చర్చ జోరుగా నడుస్తోంది. ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మంచు విష్ణు నిలబడనున్నారని సమాచారం.

ప్రస్తుతం మంచు విష్ణు తన ప్యానల్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారట. ఇందులో భాగంగా బండ్ల గణేష్‌ను తన ప్యానల్‌ చేరమని ఆహ్వానిస్తారని సమాచారం. దీంతో పాటు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లో చోటు ఆశించి భంగపడిన ఇంకొంతమంది కూడా ప్యానల్‌లోకి వెళ్తారని అంటున్నారు. మరి వారెవరు అనేది త్వరలో తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే ‘మా’ రాజకీయాలు… ఒరిజినల్‌ రాజకీయాలను తలపించడం లేదా…

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus