నంది అవార్డ్స్ ను ‘సైకిల్ అవార్డ్స్’ అంటూ కామెంట్ చేసిన వారంలోపే బండ్ల గణేష్ పై ఎర్రమంజిల్ కోర్ట్ చెక్ బౌన్స్ కేస్ లో 6 నెలల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మేటర్ పట్ల క్లారిటీ ఇచ్చాడు బండ్ల బాబు. ‘టెంపర్’ సినిమాకి కోటి నాలుగు లక్షల రూపాయలకు టెంపర్ కథా హక్కులను రచయిత వంశీ నుండి కొనడం జరిగింది. సినిమా సూపర్ హిట్ అయిన తరువాత హిందీ రీమేక్ హక్కులను దర్శక నిర్మాత అయిన రోహిత్ సెట్టి కి సంయుక్తంగా విక్రయించాము, కానీ నాకు తెలియకుండా టెంపర్ కథను ఇంగ్లీష్ నవల హక్కుల వారికి రచయిత వంశీ అమ్మాడు దీనివలన నేను తీవ్ర మనస్తాపానికి లోనై ఈ విషయాన్ని సినీ ఛాంబర్ దృష్టి కి తీసుకు వచ్చాను. అదే సమయంలో టెంపర్ చిత్ర కథకి ఇచ్చిన బ్యాలన్స్ డబ్బుల చెక్ ను నిలిపివేశాను.
ఈ వివాదం ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్నప్పటికీ వంశీ చెక్ ను పట్టుకొని కోర్టుకి వెళ్ళడు నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు వారు తుది తీర్పును ఇవ్వటం జరిగింది అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్ పొందాను ఈ విషయం పై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్ కు వెళ్తున్నాను రచయిత వంశీపై నా న్యాయ పోరాటం సాగిస్తాను టెంపర్ సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో, ఏమిటో నాకు నా సినిమా యూనిట్ సినిమా సహాయ రచయితలకు, వంశీ మనసాక్షికి తెలుసు, సినిమా రంగంలో నటులకు, దర్శకుల, సాంకేతిక నిపుణులకు కోట్ల రూపాయలు చెల్లించిన నేను తొమిది లక్షల రూపాయల చెల్లించలేని స్థితిలో లేనా? నా అభిమానులు, ఆత్మీయులు అర్థం చేసుకొనగలరని ఆశిస్తున్నాను అంటూ బండ్ల గణేష్ ఓ ఓపెన్ లెటర్ రాశారు.