Bandla Ganesh: పెద్దవారిని గౌరవించండి.. సహాయం చేస్తారని ఆశించకండి: బండ్ల గణేష్

బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే ఈయన తన ముక్కు సూటి తనంతో మనసులో ఏ విషయాన్ని దాచుకోకుండా చెప్పడం వల్లే ఎన్నో వివాగాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఎన్నో వివాదాస్పదమైన వ్యాఖ్యల ద్వారా నిత్యం వార్తలలో నిలిచే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కూడా అలాంటి పోస్టులను చేస్తూ తరుచూ విమర్శలను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు బండ్ల గణేష్ చేసే పోస్టులు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయం తెలియకుండా అందరిని అయోమయానికి గురి చేస్తూ పోస్టులు చేస్తుంటారు.

ఈ క్రమంలోనే బండ్ల గణేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక ట్వీట్ ఒకవైపు వైసీపీ అభిమానులను మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొడుతూ చేసిన ట్వీట్ లాగా ఉండడంతో ఇరువురి అభిమానులు బండ్ల గణేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ బండ్ల గణేష్ ఏ విషయం గురించి మాట్లాడారు అనే విషయానికి వస్తే… ట్విట్టర్ వేదికగా బండ్ల స్పందిస్తూ.. జీవితంలో ఎవ్వరిని నమ్మద్దు ఉన్నది ఒకే ఒక్క జీవితం.

ఈ చిన్న జీవితంలో ఎవరో మనకు సహాయం చేయరు, ఎవరు మనల్ని ఆదుకోరు వీలైతే బ్రహ్మాండంగా మనల్ని వాడుకొని మోసం చేస్తారు. ఆడుకునే వాడు ఒక్కడే కానీ మనల్ని ఆడుకునే బొమ్మలు చాలా ఉన్నాయి. మీ అందరికీ ఒకటే చెబుతున్న మిమ్మల్ని మీరు నమ్ముకోండి అంటూ బండ్ల గణేష్ తెలిపారు. ఎవరినైనా మనం నమ్మామా మన గొంతు మనమే కోసుకున్నట్టు. ఎవరిని నమ్మకుండా మీ శక్తి సామర్థ్యాలను నమ్ముకోవడం,

మీ శక్తి సామర్థ్యాలతో పోరాడండి.పెద్దవాళ్లను గౌరవించండి కానీ వారి నుంచి ఏ సహాయం ఆశించకు అంటూ ఈయన చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.అయితే బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయం అర్థం కాక ఈయన పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే చేశారని పవన్ అభిమానులు బండ్ల గణేష్ పై ఫైర్ అవుతూ తనని ట్రోల్ చేస్తున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus