మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ ప్రకటించాక… ప్రధాన పోటీదారులు ప్రకాశ్ రాజ్ – విష్ణు మధ్య ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఎన్నికల తేదీ ప్రకటించారు.. అయితే పరిస్థితులు మాత్రం వేరే ఇద్దరి మధ్య వచ్చాయి. వాళ్లే బండ్ల గణేష్ – జీవిత. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లో జీవిత ఉండటం నాకు నచ్చలేదు.. బయటికొచ్చి ఆమె మీద జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీ చేస్తా అని బండ్ల గణేష్ ప్రకటించారు. దీంతో ఈ ట్విస్ట్ నిజ రాజకీయాలను మరపించింది.
జీవితతో వ్యక్తిగతంగా నాకు విభేదాలు లేవు. ఆమె నాకు అక్కలాంటిది. కానీ, నేను అభిమానించే వారిని ఆమె విమర్శించడం నాకు నచ్చలేదు. ఇప్పటికే జీవిత ‘మా’ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లోకి రావడం నాకిష్టం లేదు. జీవిత స్థానంలో నన్ను తీసుకోవడం ప్రకాశ్ రాజ్‌కీ ధర్మం కాదు. అడగడం నాకూ ధర్మం కాదు. ఆయన ప్యానెల్‌లో జీవిత ఉండాలి. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలి అని బండ్ల గణేష్ అన్నారు.
అంతేకాదు… మేం స్నేహపూర్వక వాతావరణంలో పోటీ చేస్తున్నాం అని చెప్పారు. ‘అక్కా నీ మీద గెలుస్తా. నీ ఆశీస్సులు కావాలి’ అంటూ పంచ్ కూడా వేశారు బండ్ల గణేష్. దీంతోపాటు ‘మా’ భవనం గురించి కూడా బండ్ల గణేష్ మాట్లాడారు. దారిద్ర్య రేఖకి దిగువనున్న 100 మంది కళాకారులకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తే వారు పడే ఆనందం.. ‘మా’ భవనం కంటే విలువైందని నా అభిప్రాయం అని బండ్ల గణేష్ చెప్పారు.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!