Chiranjeevi: మెగాస్టార్ ఫొటోలపై బండ్ల గణేష్ రియాక్షన్!

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తాజాగా ట్విట్టర్ లో మెగాభిమానాన్ని చాటుకున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లంటే బండ్ల గణేష్ కి విపరీతమైన ప్రేమ, అభిమానం. పవన్ కళ్యాణ్ కి అయితే భక్తుడునని చెప్పుకుంటూ ఉంటారు బండ్ల గణేష్. ఆయనపై ఎవరైనా నెగెటివ్ గా కామెంట్ చేసినా బండ్ల గణేష్ ఊరుకోరు. సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్, చిరులపై తన అభిమానాన్ని వ్యక్తపరుస్తుంటారు. తాజాగా మరోసారి మెగాస్టార్ పై తనకున్న ప్రేమను బయటపెట్టారు బండ్ల గణేష్.

చిరంజీవి తాజాగా ఓ ఫొటోషూట్ చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తూ ట్వీట్స్ వేశారు. ఇప్పుడు ఈ ట్వీట్లు చూసి మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ బండ్ల గణేష్ ఏం రాశారంటే..”ఈ స్టైల్ చూసే మీ మీద ప్రేమ పెంచుకున్నాం. ఈ స్టైల్ చూసే మేము సినిమా రంగంలో సినిమా రంగం వైపు పరుగులు పెట్టాం. ఈ స్టైల్ చూసే మా జీవితాలకు సినిమా రంగం అనేది ఒకటుంటుంది..

ఇక్కడ ఏమైనా సాధించవచ్చు అని నమ్మకం కల్పించుకున్నాం. ఈ స్టైల్ చూసే ఇక్కడ ఎవరైనా ఏదైనా కావచ్చు అని నిర్ణయానికి వచ్చాం. ఈ స్టైల్ చూసే అందరం మీకు అభిమానులుగా మారి పోయాం.. మీరు ఎప్పటికి ఈ స్టైల్ లోనే ఉండాలని మా కోరిక.. ఎందరికో భరోసా.. ఎవరైనా ఈ రంగంలో ఏలవచ్చు అనే నమ్మకం కల్పించిన మీ స్టైల్ అంటే మాకు ఇష్టం” అంటూ మెగాస్టార్ పై ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus