శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం హ్యాపీ డేస్. ఈ సినిమా ఇప్పటికీ ఎంతో మంది విద్యార్థులకు ఫేవరెట్ సినిమా అని చెప్పాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో అప్పు పాత్రలో నటించిన నటి గాయత్రి రావ్ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో బాయ్ కట్ పాత్రలో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని సందడి చేసిన గాయత్రి రావు అనంతరం పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించారు.
ఇకపోతే ఈ సినిమాలో అప్పు పాత్రలో నటించిన ఈమె స్వయాన నటి బెంగుళూరు పద్మ గారి కుమార్తె. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పద్మ తన కూతురు ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన అసలు సినిమాల్లోకి రావాలని అనుకోలేదని అయితే శేఖర్ కమ్ముల గారు అప్పు పాత్ర గురించి చెప్పడంతో తనకు ఆ పాత్ర నచ్చి కమిట్ అయింది.ఈ పాత్రలో నటించాలంటే తప్పనిసరిగా బాయ్ కట్ ఉండాలని శేఖర్ గారు చెప్పారు.
అప్పటికీ గాయత్రికి చాలా పొడవు హెయిర్ ఉండేది. ఇలా తన జుట్టు కత్తిరించేటపుడు తను చాలా ఏడ్చింది అని ఈ సందర్భంగా బెంగళూరు పద్మ తెలిపారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత గాయత్రి ఫోటో షూట్ జరుపుకుంది.తన ఫోటోలు చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ తాను చేయబోయే గబ్బర్ సింగ్ సినిమా కోసం ఇలాంటి క్యారెక్టర్ లో నటించే అమ్మాయి కావాలని తనను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా స్టోరీ చెప్పేటప్పుడు హరీష్ శంకర్ సినిమాలో హీరోతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుందని తెలిపారు.
ఈ విధంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని భావించి ఈ సినిమాకి ఓకే చెప్పారు. అయితే ఈ సినిమాకు ముందు చెప్పినది ఒకటి తర్వాత చూపించినది ఒకటి.సినిమాకి ముందు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పి సినిమా చేసేటప్పటికి తనని హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో చూపించారని పద్మ తెలిపారు. ఈ సినిమా చేసిన తర్వాత ఇకపై తాను సినిమాల్లో నటించనని ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పి పీజీ చేయడం కోసం వెళ్లారని,అలా తను ఇండస్ట్రీకి దూరమయ్యారని బెంగళూరు పద్మ తెలిపారు.